News July 13, 2024
ఇన్‌స్టాలో భార్య పోస్ట్.. డ్రగ్ డీలర్‌ను పట్టించింది!

అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పట్టుకునేందుకు పోలీసులు టెక్నాలజీని వాడారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న 50ఏళ్ల బ్రెజిలియన్ డ్రగ్ లార్డ్ రోనాల్డ్ రోలాండ్‌ను ఇన్‌స్టా పోస్ట్‌లోని లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. తన భార్యతో కలిసి పారిస్, దుబాయ్, మాల్దీవుల్లో అతడు పర్యటించారు. అయితే వారున్న ప్రదేశాన్ని అతని భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అతణ్ని బ్రెజిల్‌లోని గ్వరూజ బీచ్ సిటీలో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News December 16, 2025
దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు

నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్‌లో ఇది 5.2%గా ఉండగా తాజా గణాంకాల్లో 8 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మహిళల భాగస్వామ్యం పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.
News December 16, 2025
దేశంలోనే తొలి AAD ఎడ్యుసిటీ.. ప్రారంభించనున్న లోకేశ్

AP: దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానుంది. ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణులను తయారుచేసేందుకు 160 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ దీన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరొందిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి.
News December 16, 2025
పిల్లల ముందు గొడవ పడితే..

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్రప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు ఉంటే పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని ఆస్ట్రేలియాలో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.


