News May 10, 2024
విమానం లగేజీ కంపార్ట్మెంట్లో నిద్రించిన మహిళ

విమానంలో హాయిగా నిద్రపోవాలనుకున్న ఓ మహిళ వినూత్నంగా ఆలోచించారు. సీట్లో ఇబ్బంది పడుతూ నిద్రపోవడం ఎందుకనుకున్న ఆమె ఏకంగా సీట్ల పైన ఉండే లగేజీ కంపార్ట్మెంట్లో నిద్రించారు. ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీయడంతో నెట్టింట వైరల్గా మారింది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో మే 6న ఈ ఘటన జరిగిందని ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది. ఈ తరహా ఘటన గతంలో వేరే ఎయిర్ లైన్స్లోనూ చోటుచేసుకుంది.
Similar News
News November 27, 2025
మంత్రి కోమటిరెడ్డిపై బీసీ జేఏసీ ఆగ్రహం

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి లేఖ రాయడాన్ని బీసీ జేఏసీ ఛైర్మన్ ప్రసన్నకుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యపై బీసీ వర్గానికి మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ అనుచరుల కోసం పాకులాడుతారా లేక బీసీ సామాజిక వర్గం వైపు ఉంటారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చుకోవాలి అని బీసీ జేఏసీ ఛైర్మన్ స్పష్టం చేశారు.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.


