News March 25, 2024

చెత్త రికార్డు కంటిన్యూ..

image

IPLలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు కంటిన్యూ అవుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ప్రతిసారి తొలి మ్యాచులో ఓడుతూ వస్తోంది. వరుసగా 12 సీజన్లలో ఒక్కసారి కూడా గెలవలేదు. సారథిని మార్చినా ఫలితం మారలేదు. నిన్న GTపై గెలిచే స్థితిలో ఉన్నా చివరికి బోల్తా పడింది ముంబై.

Similar News

News November 3, 2025

విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.

News November 3, 2025

కస్టమర్‌తో ర్యాపిడో రైడర్ అసభ్య ప్రవర్తన

image

AP: కస్టమర్‌తో ర్యాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.30am బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. గమ్యం చేరాక రైడర్(పెద్దయ్య) ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రాగా వారికి అప్పగించడంతో కేసు నమోదు చేశారు.

News November 3, 2025

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

image

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.