News November 14, 2024

XUV 3X0 కి బీఎన్‌క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్

image

మహీంద్రాకు చెందిన XUV 3X0, థార్ రాక్స్, XUV 400 కార్లకు BNCAP టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించింది. ప్రయాణికులకు కారు ఎంత భద్రత కల్పిస్తుందో చూసేందుకు చేసే పరీక్షలే NCAP టెస్టులు. ప్రపంచవ్యాప్తంగా చేసే పరీక్షల్ని Global NCAPగా, ఇండియాలో చేసే టెస్టుల్ని Bharat NCAPగా పిలుస్తారు. రేటింగ్ ఎంత బాగుంటే అంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. మారుతి డిజైర్‌కు ఇటీవల 5 స్టార్ రేటింగ్ దక్కిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్‌ను భారత్‌కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.

News December 4, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.