News May 21, 2024
పల్నాడుని వైసీపీ నేతలు వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
AP: అధికారం కోల్పోతున్నామనే అక్కసుతో YCP నేతలు దాడులకు తెగబడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడుని YCP నేతలు వల్లకాడు చేశారని దుయ్యబట్టారు. కొందరు పోలీసులు YCPతో కుమ్మక్కై TDP కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు, పోలీసులపై YCP ఆరోపణలు చేస్తోందన్నారు.
Similar News
News December 24, 2024
ధోనీకి ఝార్ఖండ్ అధికారుల షాక్?
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని ఝార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన స్థలంలో ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో త్వరలో ప్రశ్నించే అవకాశముంది. కాగా మాజీ CM అర్జున్ ముండా హయాంలో రాంచీలోని హర్ము హౌసింగ్ కాలనీలో ఈ భూమి కేటాయించారు.
News December 24, 2024
అవార్డు రాకపోవడంపై మనూ భాకర్ ట్వీట్
ఖేల్ రత్న అవార్డుపై నెట్టింట జరుగుతున్న చర్చపై ఒలింపిక్స్ మెడలిస్ట్ మనూ భాకర్ స్పందించారు. ‘అథ్లెట్గా నా దేశం కోసం ఆడటమే నా పాత్ర అని చెప్పాలని అనుకుంటున్నా. అవార్డులు, గుర్తింపులు నన్ను చైతన్యవంతం చేస్తాయి కానీ అవి నా లక్ష్యం కాదు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా. అవార్డులతో సంబంధం లేకుండా నా దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు కృషిచేస్తా’ అని తెలిపారు.
News December 24, 2024
పాక్కు చైనా నుంచి 40 యుద్ధవిమానాలు
పాకిస్థాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. చైనాకు చెందిన 40 జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను తాజాగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే రెండేళ్లలో చైనా వీటిని దశలవారీగా డెలివరీ చేయనుంది. ఈ డీల్ విలువ ఎంత అన్నది రహస్యంగా ఉంచారు. ఐదో తరం విమానమైన జే-35ని చైనా ఇప్పటి వరకూ వేరే దేశాలకు విక్రయించలేదు. అమెరికాకు చెందిన ఎఫ్-35 జెట్స్కు పోటీగా వీటిని తయారుచేసినట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి.