News October 11, 2025

రికార్డులు తిరగరాస్తున్న యువ సంచలనం

image

టెస్టుల్లో భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ దూసుకెళ్తున్నారు. అతడు అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో ఎక్కువ రన్స్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. జైస్వాల్ 48 ఇన్నింగ్సుల్లో 7 సెంచరీలతో 2,418 రన్స్ చేయగా రూట్ (ఇంగ్లండ్) 44 ఇన్నింగ్సుల్లో 2,307 పరుగులు చేశారు. ఆ తర్వాత డకెట్ 1,835, గిల్ 1,796, బ్రూక్ 1,792, పోప్ 1,471 ఉన్నారు.

Similar News

News October 11, 2025

వరుసగా 3 రోజులు సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుసగా 3రోజులు సెలవులు రానున్నాయి. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు స్కూళ్లకు శనివారం, ఆదివారం హాలిడేస్ ఉంటాయి. వీటికి తోడు సోమవారం(OCT 20) దీపావళి కావడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి సెలబ్రేట్ చేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొనే పనిలో పడ్డారు.

News October 11, 2025

ఇండియన్ కోస్డ్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

image

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ 22 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్, ఎంటీఎస్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 11, 2025

తాజా అప్డేట్స్

image

* AP: ఉప్పాడ తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
* నకిలీ మద్యం కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఇంకా అరెస్టులు ఉంటాయి: మంత్రి డీబీవీ స్వామి
* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే BJP అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
* ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ మంజూరు చేయాలని కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లేఖ