News September 24, 2024

27 ఏళ్ల క్రితం దొంగతనం.. తాజాగా క్షమాపణలు!

image

దక్షిణ కొరియా జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్‌డోసా టెంపుల్‌ హుండీలో లెటర్‌తో పాటు 2 మిలియన్ వోన్ దర్శనమిచ్చాయి. లెటర్‌లో ఇలా రాసి ఉంది. ‘నా చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో 1997లో ఆలయంలోని హుండీ నుంచి 30,000 వోన్ దొంగిలించా. దీనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. ఆ దేవుడికి క్షమాపణ చెప్పడంతో పాటు 2 మిలియన్ల వోన్‌ను (₹1.25 లక్షలు) విరాళమిస్తున్నా’ అని లేఖలో ఉంది.

Similar News

News January 17, 2026

యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

image

TG: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది. మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కె.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ ధోత్రేను సర్కార్ బదిలీ చేసింది.

News January 17, 2026

ఇండిగో సంక్షోభం.. భారీ జరిమానా విధించిన DGCA

image

వందల <<18481260>>విమానాల రద్దు<<>>, వాయిదాలతో ప్రయాణికులను ఇండిగో ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభంపై DGCA ఇవాళ చర్యలు తీసుకుంది. ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించింది. అలాగే రూ.50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని ఆదేశించింది. రాబోయే నెలల్లో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇంప్రూవ్‌మెంట్ చూపించాలని స్పష్టం చేసింది.

News January 17, 2026

రేగిపండ్లతో లాభాలెన్నో..

image

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.