News September 25, 2024
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

TG: నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్లోని జల్పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పనిమనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పనిమనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 12, 2026
తిరుపతి: శిల్ప కళాశాల నిర్మాణం ప్రత్యేకం..!

అలిపిరి వద్ద టౌన్ షిప్ నిర్మించాలంటే శిల్ప కళాశాలను తొలగించాలనే వాదన నడుస్తోంది. 1960లో శిల్ప కళ అంతరించిపోకుండా ఉండేందుకు TTD దీన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు, విగ్రహాల తయారీ, వాటి ప్రదర్శన తదితర అవసరాలకు తగిన విధంగా ఏర్పాటు చేసింది. ఆభవనం తొలగించాలంటే ఆహంగులతో తిరిగి నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత నష్టం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. TTD స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News January 12, 2026
విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.


