News March 16, 2025
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. HYD ఫిలింనగర్లోని విశ్వక్ ఇంట్లో రెండు డైమండ్ రింగులు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై విశ్వక్ తండ్రి సి.రాజు ఫిలింనగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి వాటిని తస్కరించినట్లుగా గుర్తించారు.
Similar News
News January 20, 2026
ఆసిన్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్త క్రేజీ విషెస్!

హీరోయిన్ ఆసిన్, మైక్రోమ్యాక్స్ కోఫౌండర్ రాహుల్ శర్మ తమ పదో వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిన్తో ఉన్న వెడ్డింగ్ పిక్ షేర్ చేస్తూ ‘ఆసిన్ నా జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలో కో-ఫౌండర్. ఆమె లైఫ్లో నేను కో-స్టార్గా ఉండటం నా అదృష్టం’ అని రాహుల్ అన్నారు. ‘మన ఇంటిని, నా మనసుని హై-గ్రోత్ స్టార్టప్లా నడిపించు’ అంటూ ఆసిన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
News January 20, 2026
వంటింటి చిట్కాలు

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడి గుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూర అడుగంటి మాడు వాసన వస్తే వాటిలో నిమ్మ, వెనిగర్, టమాటో రసం, వెన్న, పెరుగు కలిపితే వాసన పోయి, రుచి వస్తుంది.
News January 20, 2026
తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ సర్కార్ వార్ మరోసారి బయటపడింది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ RN రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళ గీతం తర్వాత జాతీయ గీతాన్ని కూడా ప్లే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అప్పావు నిరాకరించడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇలా జరగడం ఇది వరుసగా మూడోసారి. 2024, 2025లో కూడా ఆయన ఇదే కారణంతో సభను బహిష్కరించారు.


