News January 13, 2025
శ్రీవారి పరకామణిలో చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

AP: తిరుమల శ్రీవారి పరకామణిలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.అర కోటి ఉంటుందని తెలిపారు.
Similar News
News November 26, 2025
వీటిని వంటగదిలో పెడుతున్నారా?

కిచెన్లో గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్ ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. కిచెన్లోనే ఫ్రిడ్జ్, ఓవెన్ ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువ. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పెట్టాలి. అలాగే ఒవెన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ దూరంగా ఉంచాలి. ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు, పాతవస్తువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 26, 2025
‘సఫ్రాన్’ ఏర్పాటుతో MSMEలకు వ్యాపార అవకాశాలు: సీఎం రేవంత్

TG: HYDలో ‘సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కొత్త సెంటర్ ప్రారంభోత్సవంలో CM రేవంత్ పాల్గొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ₹13K కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సెంటర్తో స్థానిక MSMEలకు, ఇంజినీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయన్నారు. బెంగళూరు-HYDను డిఫెన్స్& ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని PMకు విజ్ఞప్తి చేశారు.
News November 26, 2025
BREAKING: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు

AP: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. దీనికి ‘సెన్యూర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇది 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


