News March 17, 2025

పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో పట్టపగలే చోరీ

image

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌కు చెందిన లాహోర్‌ ఫామ్‌హౌస్‌లో దొంగలు పడ్డారు. పట్టపగలే రూ.5లక్షల విలువైన సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్లిపోయారు. ముందురోజే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఒకరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని అక్మల్ తండ్రి వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Similar News

News December 5, 2025

ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి: ఎంపీ

image

వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఎంపీ రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్‌కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.

News December 5, 2025

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

image

ఇండిగో విమానాలు <<18473431>>రద్దు<<>> కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ ఈ సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వివిధ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రేట్ రూ.40వేలకు చేరింది. హైదరాబాద్-ముంబైకి రూ.37వేలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్ల టికెట్ ధరలు రూ.6000-7000 మధ్య ఉంటాయి. అటు ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.