News October 20, 2024
కేరళ ‘శ్రీ పద్మనాభ స్వామి’ ఆలయంలో చోరీ
కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. స్వామివారి పూజకు వినియోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడని వెల్లడించారు. ఇతర నిందితులతో కలిసి గత వారం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2025
బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న శాంటో
బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన తమకు సమాచారాన్ని అందించారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. టెస్టులు-వన్డేల్లో శాంటోనే కెప్టెన్గా కొనసాగుతారని వెల్లడించింది. దగ్గర్లో టీ20 సిరీస్ లేని నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.
News January 3, 2025
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 54మంది మృతి
గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాలపై చేసిన ఈ దాడుల్లో తమ పౌరులు కనీసం 54మంది మృతిచెందారని, అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గాజా యంత్రాంగం ప్రకటించింది. అమాయకులైన పౌరులు తలదాచుకున్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడిందని మండిపడింది. కాగా.. మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.
News January 3, 2025
ఎన్డీయేలో చేరాలన్న ఒత్తిడి మాపై లేదు: అబ్దుల్లా
NDAలో చేరాలని తమపై ఎవరూ ఒత్తిడి తేవడం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘BJP మాపై ఎటువంటి ఒత్తిడీ తీసుకురావట్లేదు. మా సర్కారును అస్థిరపరిచే ప్రయత్నాలేవీ చేయమని అగ్రనాయకత్వం మాట ఇచ్చింది. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్కు ఇచ్చిన సహకారాన్ని నాకూ అందిస్తామని హామీ లభించింది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.