News April 11, 2025

కియాలో 900 ఇంజిన్ల చోరీ.. ఇంటి దొంగల పనే!

image

AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా పరిశ్రమలో <<16027604>>900 ఇంజిన్ల చోరీపై<<>> విచారణ కొనసాగుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొచ్చే క్రమంలోనే దొంగతనం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ‘ఇందులో బయటివాళ్ల ప్రమేయం లేదు. కంపెనీ సిబ్బంది లేదా మాజీ ఉద్యోగుల హస్తం ఉంది. ఈ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

Similar News

News January 6, 2026

వంటింటి చిట్కాలు

image

☛ క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క వేయాలి.
☛ కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త పాల మీగడ కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
☛ పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి.
☛ కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు పోవడంతో పాటు కూర రుచిగా ఉంటుంది.
☛ అప్పడాలను వేయించే ముందు కాసేపు ఎండలో ఉంచితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.

News January 6, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడులో నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 26,200 వద్ద, సెన్సెక్స్ 60 పాయింట్లు క్షీణించి 85,379 వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా రంగాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి, డాబర్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC Bank నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, ICICI Bank, టాటా స్టీల్‌ షేర్లపై ఆసక్తి కనిపిస్తోంది.

News January 6, 2026

పచ్చిరొట్టగా పెసర/మినుముతో లాభాలు

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.