News July 27, 2024
సెప్టెంబర్ 5 నాటికి వారి నియామకం: సీఎం సలహాదారు

TG: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగానే రిలీజ్ చేస్తామని సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలకు ఆయన హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతుల్లో చిన్న చిన్న పొరపాట్లను సవరించుకునేందుకు జిల్లా అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. మరోవైపు రుణమాఫీ పూర్తవగానే డీఏలు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
Similar News
News January 19, 2026
ఖమ్మం: ఉదారతను చాటుకున్న డీఈఓ

పదో తరగతి విద్యార్థులపై డీఈఓ చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 13 పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్నాక్స్ అందించాలని నిర్ణయించారు. సుమారు 250 మంది విద్యార్థులకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం రూ.20 విలువైన అల్పాహారం పంపిణీ చేయనున్నారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 19, 2026
పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో నం.3 పొజిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(12,676) నిలిచారు. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచులో సెంచరీతో ఈ రికార్డును చేరుకున్నారు. 60+ సగటుతో 93కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆయన కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(12,662), సంగక్కర(9,747), కల్లిస్(7,774), కేన్ విలియమ్సన్(6,504) ఉన్నారు.


