News April 5, 2024
మోదీ పాలనలో వారి అరెస్టులు ఇంకా పెరిగాయి: కమల్ హాసన్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం తన శత్రువని, తన జీవితంలో కులానికి చోటు లేదన్నారు. అట్టడుగు స్థాయిలో ఇంకా ఎందరు ఉన్నారో తెలుసుకునేందుకు కుల గణన చేపట్టాలన్నారు. తమిళనాడులో మత్స్యకారుల అరెస్టులు ఆగిపోలేదని, పదేళ్ల మోదీ పాలనలో ఇంకా పెరిగాయని విమర్శించారు.
Similar News
News February 9, 2026
దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
News February 9, 2026
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 9, 2026
స్కాములతో రేవంత్ చరిత్రలో నిలిచిపోతారు: హరీశ్

TG: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులో ఉందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను BRS MLA హరీశ్ రావు ఖండించారు. తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ బీజేపీతో కలవలేదన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం స్కాములతో చరిత్రలో నిలిపోతారు’ అని విమర్శించారు.


