News April 19, 2024

వీళ్ల ఆస్తులు రూ.వందల్లోనే!

image

సాధారణంగా ఎంపీ అభ్యర్థి ఆస్తి రూ.లక్షలు లేక రూ.కోట్లలోనో ఉంటుంది. కానీ నేడు జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల అభ్యర్థుల్లో కొందరి ఆస్తి రూ.వందల్లో ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి నుంచి పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పోన్‌రాజ్ ఆస్తి రూ.320. చెన్నై నార్త్ స్వతంత్ర అభ్యర్థి సూర్యముత్తు, మహారాష్ట్రలోని రామ్‌తేక్ స్వతంత్ర అభ్యర్థి కార్తిక్ గెండ్లాజీ ఆస్తుల విలువ చెరో రూ.500గా ఉంది. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 18, 2025

ఖైదీని మార్చిన పుస్తకం!

image

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.

News November 18, 2025

X(ట్విటర్) డౌన్‌కు కారణమిదే!

image

ప్రముఖ SM ప్లాట్‌ఫామ్ ‘X’ సేవలు <<18322641>>నిలిచిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. దాని హోస్ట్ సర్వర్ ‘క్లౌడ్‌ఫ్లేర్‌’లో గ్లిచ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. X మాత్రమే కాకుండా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన కాన్వా, పర్‌ప్లెక్సిటీ వంటి సేవలు నిలిచిపోయాయి. ‘సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ వెల్లడించింది.

News November 18, 2025

సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

image

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్‌తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్‌స్టిక్‌గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.