News September 23, 2024
పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా వారి వైఖరి: హరీశ్

TG: మంత్రి శ్రీధర్ బాబు <<14169541>>వ్యాఖ్యలు<<>> నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తే కలుస్తానేమో గానీ ఇలాంటి సమావేశాలకు కలవనని తేల్చి చెప్పారు. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉందని దుయ్యబట్టారు.
Similar News
News November 20, 2025
పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.
News November 20, 2025
Alert: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని APSDMA తెలిపింది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది.
News November 20, 2025
‘1600’ సిరీస్తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్కు మారాల్సి ఉంది.


