News August 8, 2025
వాళ్ల పని ఫోన్లు వినడమే: బండి సంజయ్

TG: భార్యాభర్తల ఫోన్లు విన్న దుర్మార్గులు KCR కుటుంబ సభ్యులని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ‘గత BRS పాలనలో వారు చేసిన పని ఒక్కటే.. అందరి ఫోన్లూ వినడమే. జాబితాలో పేర్లున్న రేవంత్, కేసీఆర్ కూతురు, అల్లుడిని కూడా విచారణకు పిలవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. విచారణ చేస్తున్న సిట్ అధికారులు మంచోళ్లే కానీ, రేవంత్ సర్కార్‌పైనే తమకు నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 8, 2025
పుతిన్‌కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం

రష్యాతో భారత్ బంధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయాన్ని పుతిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అటు ఇప్పటికే రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఆయన ఇండియాలో పర్యటిస్తారని దోవల్ వెల్లడించారు.
News August 8, 2025
టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్‌లో ఆయన ఆడతారని సమాచారం. ప్రస్తుతం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో SMలో చక్కర్లు కొడుతోంది. కాగా సూర్యకు జర్మనీలో గత జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన NCAలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
News August 8, 2025
US ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత.. క్లారిటీ

అమెరికా నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసిందన్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని, అవి కేవలం కల్పితమంటూ కొట్టిపారేసింది. వివిధ కొనుగోళ్లు ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేసింది. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో కొనుగోళ్లు నిలిపివేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.