News June 2, 2024

రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్రలు ప్రముఖం: రేవంత్

image

తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్‌ పాత్రలు ప్రముఖమైనవని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిందంటే మొట్టమొదటి త్యాగం అప్పటి UPA ఛైర్‌పర్సన్ సోనియా గాంధీది. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ సహకారం అందించారు. అప్పటి బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్‌సభలో సంపూర్ణ మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లు ఆమోదింపజేశారు’ అని రేవంత్ వివరించారు.

Similar News

News October 14, 2025

రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

image

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్‌లు, CII ప్రతినిధులు, ఎక్స్‌పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

News October 14, 2025

పెన్షనర్ల కోసం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్’ క్యాంపైన్

image

పెన్షనర్ల కోసం కేంద్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1-30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహా పెన్షనర్లకు నగదు అందించే 19 బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. 1.8 లక్షల పోస్ట్ మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్‌లు ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి DLC జెనరేట్ చేస్తారు. సాధారణంగా పెన్షన్ కోసం ఏటా పెన్షనర్లే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.

News October 14, 2025

ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.