News November 28, 2024

అప్పుడు అభిమానిగా.. ఇప్పుడు తోటి ఆటగాడిగా..

image

నితీశ్ కుమార్ రెడ్డి కోహ్లీకి వీరాభిమాని. 2018లో BCCI అవార్డులకు హాజరైన నితీశ్ విరాట్‌తో సెల్ఫీకి చాలా ట్రై చేశారు. కుదరలేదు. దూరం నుంచే విరాట్‌, తాను ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా సెల్ఫీ తీసుకుని సంతోషపడ్డారు. కట్ చేస్తే.. 2024లో విరాట్ 81వ సెంచరీ సెలబ్రేషన్లో తానూ భాగమయ్యారు. సెంచరీ పూర్తవగానే తన హీరోని హగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కదా సక్సెస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: అమీషా

image

పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెడుతుండటం వల్లే తాను ఇప్పటిదాకా వివాహం చేసుకోలేదని నటి అమీషా పటేల్ వెల్లడించారు. ’50 ఏళ్ల వయసులోనూ నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్‌లో సగం వయసున్న వారూ డేట్‌కి రమ్మని అడుగుతుంటారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లొద్దనడంతో వదులుకున్నా. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమే’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

News September 19, 2025

శాసనమండలి వాయిదా

image

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.

News September 19, 2025

ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.