News May 4, 2024
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ
గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.
Similar News
News December 27, 2024
సుజుకీ మాజీ ఛైర్మన్ కన్నుమూత
సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈనెల 25న మరణించారు. జపాన్లో 1930లో జన్మించిన ఓసాము 1958లో సుజుకీలో చేరారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏళ్ల పాటు సంస్థ ఛైర్మన్గా కొనసాగారు. ప్రస్తుతం భారత్లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.
News December 27, 2024
రేపు ఈ పనులు చేయకండి
శని త్రయోదశి(రేపు) రోజున శనీశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. రేపు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను అవమానించడం, ఇనుముతో కూడిన వస్తువులు దానం చేయడం, పాదాలతో ఎవరినైనా తాకడం, మాంసం తినడం, మద్యం సేవించడం వంటివి చేయొద్దని అంటున్నారు. నలుపు దుస్తులు ధరించడం, పేదలకు ఆహారం, నల్ల నువ్వులు దానం చేయడం, శని చాలీసా పఠనం వంటివి చేయమని సూచిస్తున్నారు.
News December 27, 2024
26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ మృతి
ముంబై ఉగ్రదాడి(26/11) వెనుక మాస్టర్ మైండ్, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హార్ట్ఎటాక్తో చనిపోయాడు. 2023లో UNO అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్పై విషం చిమ్మే హఫీజ్ రామ్పుర, ఎర్రకోట, ముంబై దాడుల్లో కీలకపాత్ర పోషించారు.