News January 14, 2025
అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్
TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్‌కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.
Similar News
News January 15, 2025
కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?
కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.
News January 15, 2025
నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.
News January 15, 2025
వరుసగా 8 హిట్లు ఖాతాలో..
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుసగా 8 సినిమాలు సక్సెస్ సాధించిన ఈతరం దర్శకుడు అనిల్ అని సినీ వర్గాలు తెలిపాయి. ఆయన డెబ్యూ మూవీ పటాస్ సూపర్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటును ఆయన కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి.