News March 22, 2024
అప్పుడు కటింగ్ షాప్.. కట్ చేస్తే రూ.1200 కోట్లు

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజమే. ఇందుకు ఈ రమేశ్ ఉత్తమ ఉదాహరణ. తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెడితే వచ్చిన ఫలితం రూ.1200 కోట్లు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి, ఏం చేశారు? కటింగ్ షాపు నుంచి సీన్ కట్ చేస్తే ఇంత సంపద ఎలా వచ్చింది..? అనే విషయాల కోసం ఇక్కడ <
Similar News
News February 23, 2025
టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.
News February 23, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. కోహ్లీ ఆడేనా?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడటం అనుమానాస్పదంగా మారిందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న ప్రాక్టీస్ సెషన్లో కాలికి గాయం కావడంతో, ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కనిపించినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు SMలోనూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోహ్లీ గాయంపై BCCI ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని అంతా భావిస్తున్నారు. మ్యాచ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News February 23, 2025
‘శివరాత్రి’ రోజంతా ఉచిత క్యూలైన్లు

AP: శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులకు సూచించారు. ఆ రోజంతా ప్రముఖ శివాలయాల్లో ఉచిత క్యూలైన్లు కొనసాగించాలని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలకు అనుమతించకపోతే వేగంగా క్యూలైన్లు ముందుకు కదులుతాయన్నారు. కాగా శ్రీశైలం, శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.