News March 19, 2024
అప్పుడు అబ్బాయికి, ఇప్పుడు బాబాయ్‌కి బీజేపీ పోటు
RLJP ఫౌండర్ రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, బాబాయ్ పశుపతికి విభేదాలొచ్చాయి. పార్టీని బాబాయ్ చేజిక్కించుకుని అబ్బాయ్‌ని వెళ్లగొట్టారు. అప్పుడు BJP పశుపతికే సపోర్ట్ చేసి, కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. చిరాగ్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) ఏర్పాటుచేశారు. మారిన పరిస్థితులతో ఇప్పుడు చిరాగ్ పార్టీకే NDA 5 సీట్లను కేటాయించింది. దీంతో పశుపతి కేంద్రమంత్రి పదవికి <<12882991>>రిజైన్<<>> చేశారు.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News January 9, 2025
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
News January 9, 2025
BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్
BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.