News February 13, 2025

అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు

image

2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం

image

TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.

News February 13, 2025

రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి

image

AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.

News February 13, 2025

రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

error: Content is protected !!