News March 29, 2024
అప్పుడు హెచ్చులకు పోయింది.. ఇప్పుడు తోకముడిచింది – 2/2

ట్రేడ్ నిలిచిపోవడంపై అసంతృప్తితో ఉన్న వ్యాపార వర్గాలు సత్సంబంధాలు నెలకొల్పాలని పాక్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయట. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇటీవల పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికల తర్వాత దీనిపై ముందుకెళ్లాలని పాక్ భావిస్తోందట. పూర్తిస్థాయిలో ట్రేడ్ జరిగితే పాక్ ఎగుమతులు గరిష్ఠంగా 80% పెరగొచ్చని 2018లో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
Similar News
News November 17, 2025
ఐబొమ్మకు ఇక సెలవు

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.