News July 16, 2024

అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయ్యింది: రోహిత్ శర్మ

image

T20WC ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన చివరి 5 ఓవర్లలో పడిన టెన్షన్‌ను రోహిత్ శర్మ ఓ ఈవెంట్‌లో పంచుకున్నారు. ’15వ ఓవర్‌లో క్లాసెన్ దంచికొట్టడంతో అంతా మారిపోయింది. సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాలి. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయ్యింది. ఎక్కువ ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టా. భయపడలేదు. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుంది’ అని రోహిత్ వెల్లడించారు.

Similar News

News January 9, 2026

NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (<>NHAI<<>>) 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News January 9, 2026

ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

image

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.

News January 9, 2026

NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/