News May 10, 2024
బీజేపీలో పెద్ద గద్దలున్నాయి: కేసీఆర్

TG: రాష్ట్రానికి PM మోదీ చేసిందేమీ లేదని కేసీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో మాట్లాడుతూ.. ‘BJP ఎజెండాలో పేదలు లేరు.. పెద్ద గద్దలు ఉన్నాయి. ధర్మం కోసం అని మాట్లాడే మోదీ.. హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. 2014లో ప్రధానిగా గెలిచాక రూ.15 లక్షలు ఇస్తానన్నారు.. కానీ రూ.15 కూడా ఇవ్వలేదు. ఆయన మళ్లీ విజయం సాధిస్తే పెట్రోల్, డీజిల్ ధర లీటర్ రూ.400 దాటుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
సంక్షోభం.. నాటి కష్టాలు మళ్లీ తప్పవా?

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని కొవిడ్ తరహాలో ఎదుర్కొందామన్న PM మోదీ <<19455938>>వ్యాఖ్యలు<<>> కలవరపెడుతున్నాయి. దీంతో మరోసారి కరోనా కష్టకాలం లాంటి పరిస్థితులు రానున్నాయా? అనే ప్రశ్న ప్రజలను తొలుస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగి రాబోయే రోజుల్లో ఇంధన సరఫరా దాదాపుగా నిలిచిపోతే? ఇతర సరకుల దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే? ఈ ప్రభావం ఉద్యోగాలపైనా పడితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మీరేమంటారు?
News March 23, 2026
FASTag.. ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు బంద్!

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై పూర్తిగా డిజిటల్ టోలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు NHAI ప్రకటించింది. ఆ రోజు నుంచి నగదు చెల్లింపులను నిలిపివేసే అవకాశముందని తెలిపింది. ఫాస్టాగ్, UPI ద్వారానే ట్రాన్సాక్షన్స్ ఉంటాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలలో రద్దీని తగ్గించడం, లేన్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగుపరచడం, వేగవంతమైన టోల్ చెల్లింపులే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామంది.
News March 23, 2026
INTERESTING: గుండె, మెదడు లేని జీవి!

సముద్ర గర్భంలో ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ‘స్టార్ ఫిష్’ ఒకటి. దీనికి మిగిలిన జీవులలా మెదడు, గుండె, రక్తం ఉండవు. రక్తానికి బదులుగా ఇది సముద్రపు నీటినే తన శరీరమంతా పంపిస్తూ పోషకాలను పొందుతుంది. దీనిని ‘వాటర్ వాస్క్యులర్ సిస్టమ్’ అంటారు. మెదడు లేకపోయినా, తన నాడీ వ్యవస్థ ద్వారా పరిసరాలను పసిగట్టి ఆహారాన్ని వేటాడటం ఈ జీవి ప్రత్యేకత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(28/100)


