News August 27, 2024

డైలీ వేపాకు తింటే బోలెడు ప్రయోజనాలు!

image

వేపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. వేపాకు తింటే దంత సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు‌ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మల బద్దకం, అజీర్తి తగ్గుతాయి. ప్రతి రోజు వేపాకు తినడం వల్ల శరీరం దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. వేపాకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున వేపాకు తింటే మధుమేహం తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

Similar News

News January 6, 2026

US ఫెడరల్ జడ్జిలకు నో రిటైర్మెంట్.. ఎందుకంటే?

image

వెనిజులా లీడర్ మదురో కేసును విచారిస్తున్న US డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి హెల్లర్‌స్టెయిన్ వయసు 92 ఏళ్లు. మనదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్లకు రిటైరవుతారు. కానీ US రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ జడ్జిలకు రిటైర్మెంట్ ఉండదు. రాజకీయ ఒత్తిళ్లను నియంత్రించే ఉద్దేశంతో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడి జడ్జిల సగటు వయసు 69 ఏళ్లు. తీవ్రమైన దుష్ప్రవర్తనకు అభిశంసన ద్వారా మాత్రమే తొలగించే వీలుంది.

News January 6, 2026

దేశంలో ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలివే!

image

భారత ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఆంజనేయుడి భారీ విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. APలోని శ్రీకాకుళం(176ft), పరిటాల(135ft), కర్ణాటకలోని బిదనగెరె(161ft)లో ఎత్తైన విగ్రహాలు అబ్బురపరుస్తాయి. ఢిల్లీ, సిమ్లా, ఒడిశాలోనూ ఒక్కో విగ్రహం 108 అడుగుల ఎత్తులో ఉంటుంది. UP హనుమాన్‌ధామ్‌లో 125ft, హనుమాన్ నందురా(MH)లో 105ft , బెంగళూరులోని హనుమాన్ అగరాలో 102అడుగుల ఎత్తున్న ప్రతిమలు దర్శనమిస్తాయి.

News January 6, 2026

‘గ్రీన్‌ల్యాండ్’పై ట్రంప్‌ ఎందుకు కన్నేశారంటే?

image

గ్రీన్‌ల్యాండ్ కావాలన్న US <<18765231>>కోరిక<<>> వెనుక రక్షణతోపాటు అక్కడ దొరికే రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఐరన్ కారణమని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి కోరిక కాదు. 1867లో రష్యా నుంచి అలాస్కాని కొన్నప్పుడే దీనిపై సంప్రదించింది. 1946లో $100M ఆఫర్ కూడా చేసింది. ఒకవేళ రష్యా క్షిపణులతో దాడిచేస్తే న్యూక్లియర్ మిస్సైళ్లు పంపేందుకు USకు నార్త్ పోల్, గ్రీన్‌ల్యాండ్ దగ్గర దారి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.