News April 9, 2025

కీరదోసతో లాభాలెన్నో!

image

కీరదోస తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది. గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది.

Similar News

News November 21, 2025

రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

image

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.

News November 21, 2025

సీఎస్ పదవీకాలం పొడిగింపు

image

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.

News November 21, 2025

అపార్ట్‌మెంట్ల సముదాయాలకు వీధిపోటు, వీధి శూల ప్రభావం ఉంటుందా?

image

గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్‌మెంట్లలో వీధిపోటు, వీధి శూల ప్రభావం తక్కువగా ఉంటుందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండి, కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇతరుల దృష్టి తక్కువగా పడుతుంది. భవన నిర్మాణం, భద్రతా ప్రణాళికలు వీటికి రక్షణగా నిలుస్తాయి. ప్లాట్‌లను సమూహంగా నిర్మించడం వలన వచ్చే భద్రత వాటి ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది’ అని వివరించారు. <<-se>>#Vasthu<<>>