News March 20, 2025
జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.
Similar News
News March 20, 2025
IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.
News March 20, 2025
చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కే ప్రచారం: VD టీమ్

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై హీరో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. ‘రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని మాత్రమే ఆయన అంబాసిడర్‌గా పనిచేసేందుకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కి మాత్రమే ఆయన ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎ23 సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కూడా పలుమార్లు చెప్పింది’ అని ఆయన టీమ్ వివరణ ఇచ్చింది.
News March 20, 2025
ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.