News April 29, 2024
లోక్సభ బరిలో తొమ్మిది మంది నారీమణులు

APలోని 25 లోక్సభ స్థానాల్లో 9మంది మహిళలకు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించాయి. వీరిలో వైసీపీ నుంచి తనూజా రాణి- అరకు, విశాఖ-బొత్స ఝాన్సీ, నరసాపురం- ఉమా బాల, హిందూపురం- శాంత; కూటమి అభ్యర్థులుగా.. నంద్యాల- బైరెడ్డి శబరి(TDP), రాజమహేంద్రవరం- పురందీశ్వరి(BJP), అరకు- కొత్తపల్లి గీత(BJP) ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కడప-YS షర్మిల, ఏలూరు-లావణ్య పోటీ చేస్తున్నారు. వీరిలో పార్లమెంట్ తలుపుతట్టేదెవరో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 31, 2026
పాక్ ఆర్మీ కల్నల్ హత్య.. పహల్గామ్ దాడిలో ఇతడి హస్తం?

పాకిస్థానీ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ హతమయ్యాడు. జనవరి 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో గుర్తు తెలియని గన్మెన్లు చంపేశారు. అతడి కారుకు బుల్లెట్లతో తూట్లు పొడిచారు. 2025 ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టెర్రరిస్టులకు హ్యాండ్లర్గా ఇతడు వ్యవహరించినట్లు సమాచారం.
News January 31, 2026
అంబటి రాంబాబుకు ఫోన్ చేసిన YS జగన్

AP: YCP నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి <<19014952>>ఘటన<<>>పై పార్టీ అధినేత, మాజీ CM వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. అంబటికి ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే విధంగా రాష్ట్రం జంగిల్రాజ్గా మారిందని, చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని ట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
News January 31, 2026
వారికి 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవులు

AP: ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ రాష్ట్ర మహాసభ కోసం విజయవాడకు వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. 4, 5వ తేదీల్లో సెలవు ఉండనుంది. సభ కోసం రాష్ట్రంలోని 90 డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేసింది.


