News February 19, 2025
బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.
Similar News
News January 28, 2026
‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.
News January 28, 2026
‘అజిత్’ రాజకీయ వారసులు ఎవరు?

మహారాష్ట్ర Dy CM అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది. కుమారుడు పార్థ్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ MP) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్గా ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ NCP నుంచి విడిపోయి అజిత్ BJP-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే. కాగా వారసుల నిర్ణయాలు MH ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News January 28, 2026
కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <


