News March 12, 2025
తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: సీఎం

AP: ‘తల్లికి వందనం’ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.
Similar News
News April 4, 2026
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.
News April 4, 2026
సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.
News April 4, 2026
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.


