News November 26, 2024
వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు: చైనా

చైనాతో <<14711264>>వాణిజ్యంలో ఆంక్షలు విధించాలని<<>> అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. వాణిజ్యంలో యుద్ధం వలన ఏ దేశానికీ లాభం ఉండదని అమెరికాలో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి లియూ పెంగ్యూ వ్యాఖ్యానించారు. అది ఎవరూ గెలవని పోరు అని అభివర్ణించారు. చైనా-అమెరికా వాణిజ్య సహకారం పరస్పర లాభదాయకమని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News February 1, 2026
ఆ మూడు కర్తవ్యాలతోనే బడ్జెట్ రూపొందించాం: ఆర్థికమంత్రి

ఈసారి కేంద్ర బడ్జెట్‌ను మూడు కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రోత్ పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, తగిన సంస్కరణలతో ఆ వృద్ధిని కొనసాగించడం అనేవి మూడు కర్తవ్యాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఇవి సహాయపడతాయని తెలిపారు.
News February 1, 2026
సిట్ విచారణ.. ఫాంహౌస్ నుంచి బయలుదేరిన KCR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావడానికి BRS అధినేత KCR ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి HYDలోని నందినగర్ నివాసానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.30గంటలకు ఆయన ఇంటికి చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఫాంహౌస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోగా వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను సిట్ విచారించనుంది.
News February 1, 2026
7 హైస్పీడ్ రైళ్లు.. హైదరాబాద్‌కు అగ్ర తాంబూలం!

దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 3 హైదరాబాద్ మీదుగా నడవనున్నాయి. ముంబై-పుణే, హైదరాబాద్-బెంగళూరు, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మధ్య ఇవి నడవనున్నాయి. వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జల మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.


