News April 14, 2024

నా కంటే అందమైన అమ్మాయిలున్నారు: రష్మిక

image

నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కంటే అందం, టాలెంట్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నారు. తనకు మంచి అవకాశాలు రావడంతో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. జీవితంలో సంతోషాన్ని, పొందిన విజయాలను సాధారణంగా భావించొద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప-2, రెయిన్‌బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Similar News

News March 23, 2026

OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

image

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.

News March 23, 2026

ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

image

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.

News March 23, 2026

IPL: ఆ రికార్డు SRHదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన 287/3 స్కోరు అత్యధికం. హెడ్, క్లాసెన్ వంటి పవర్‌ హిట్టర్ల విధ్వంసంతో 2025లోనూ SRH 286/6(RR) & 278/3(MI)తో తన సత్తా ఏంటో చూపించింది. అత్యధిక స్కోర్ల జాబితాలో టాప్-5లో నాలుగు SRH పేరిట ఉండటం విశేషం. అలాగే 2024లో DCపై KKR 272/7తో ఐదో పొజిషన్‌లో ఉంది. ఈ సీజన్‌లోనైనా SRH 300 రన్స్ కొడుతుందో చూడాలి.