News March 4, 2025
అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.
Similar News
News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
News March 4, 2025
ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది.
News March 4, 2025
మనుస్మృతి, బాబర్నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.