News October 1, 2024

ఈ వికెట్ కీపర్లకు భారీ డిమాండ్

image

త్వరలో జరిగే IPL2025 మెగావేలంపై భారీ అంచనాలున్నాయి. అయితే భారీ సిక్సర్లు బాదడంతో పాటు మెరుపులా వికెట్ కీపింగ్ చేసే వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. ఇషాన్‌కు MI 2022లోనే రూ.15.25కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. RR తరఫున ధ్రువ్, PBKS‌లో జితేశ్ అంచనాలకు మించే రాణించారు. వీరిలో మీ ఓటు ఎవరికి?

Similar News

News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News October 1, 2024

రజినీ ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

News October 1, 2024

వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం: CBN

image

AP: దీపావళికి 3ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని CM చంద్రబాబు పునరుద్ఘాటించారు. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎలా ఇవ్వచ్చో చేసి చూపించామన్నారు. వాలంటీర్లను ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ను తీసుకొస్తామని చెప్పారు. నూతన ఇసుక పాలసీతో ప్రజలకు దగ్గరలో ఉన్న ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లొచ్చని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.