News October 8, 2025

మద్యం దుకాణాల దరఖాస్తులకు స్పందన కరవు!

image

TG: మద్యం దుకాణాల దరఖాస్తుల విషయంలో ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని 2,620 రిటైల్ మద్యం దుకాణాలకు 2 వారాల్లో 2 వేల దరఖాస్తులే వచ్చాయి. 2023లో మొత్తం 98,900 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2,600 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది దరఖాస్తు రుసుము రూ.3 లక్షలకు పెంచడం, OCT 12 వరకు మంచి రోజులు లేకపోవడమే తక్కువ స్పందనకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. OCT 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది.

Similar News

News October 8, 2025

దగ్గు సిరప్‌‌పై కేంద్రం కీలక ఆదేశాలు

image

దగ్గు సిరప్‌తో MP, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్‌‌, ఫైనల్ ప్రొడక్ట్స్‌ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

News October 8, 2025

పాకిస్థాన్ ఘోర ఓటమి

image

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో చివర నిలిచింది.

News October 8, 2025

‘జోహో’కు జయహో అంటున్న కేంద్రం

image

PM మోదీ ‘స్వదేశీ’ పిలుపు ‘<<17874488>>ZOHO<<>>’ మెయిల్, ‘ARATTAI’ మెసేజింగ్ యాప్‌‌కు కలిసొచ్చింది. శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ సంస్థలకు కొన్నేళ్లుగా రాని గుర్తింపు కొద్దిరోజుల్లోనే సొంతమైంది. ఇటీవల కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ZOHO’కు మారగా ఇవాళ హోంమంత్రి అమిత్‌షా జోహో మెయిల్ (amitshah.bjp@ http://zohomail.in) క్రియేట్ చేసుకున్నారు. స్వయంగా కేంద్రమే ఫ్రీ పబ్లిసిటీ చేస్తుండటంతో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.