News February 15, 2025
ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.
Similar News
News November 2, 2025
దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

TG: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
గేదెను కొనేటప్పుడు ఇవి తప్పక తెలుసుకోండి

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలులకు రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఇవాళ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA తెలిపింది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. TGలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు HYD IMD పేర్కొంది.


