News August 15, 2024
అక్కడ మహిళలకు నెలసరి సెలవు

పంద్రాగస్టు రోజున ఒడిశా ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు ఒక రోజు నెలసరి సెలవు ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతీ పరిదా ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పీరియడ్స్‌లో తొలి రోజు లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2026
నేడు దావోస్‌కు CM రేవంత్

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.
News January 19, 2026
శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
News January 19, 2026
సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!


