News April 3, 2025
మంత్రివర్గంలో మైనార్టీలకి చోటు: టీపీసీసీ చీఫ్

TG: మంత్రి వర్గ విస్తరణ అనేది AICC పరిధిలోని అంశమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. క్యాబినెట్ విస్తరణలో మైనార్టీలకి అవకాశం కల్పిస్తామన్నారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని, HCU భూములని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లలో తమిళనాడు తరహాలోనే తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.
News November 24, 2025
అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


