News November 1, 2024
టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు

AP: బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Similar News
News December 31, 2025
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు!

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ <<18710950>>సమ్మె<<>> చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ను కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పనిలోకి రాకుండా IDలు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు వర్క్ కొనసాగించాలని కొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో యాడ్స్ చేయించాయి.
News December 31, 2025
ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్?

రాజాసాబ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. తర్వాత కల్కి-2 మూవీ షూటింగ్లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన కేటాయిస్తారని పేర్కొన్నాయి. గతేడాది జూన్లో రిలీజైన కల్కి ₹1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరోవైపు స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావచ్చని టాక్.
News December 31, 2025
‘గల్వాన్’ గొడవ.. అసలు అప్పుడేమైంది?

<<18714683>>గల్వాన్ లోయ<<>>లో 2020 జూన్ 15న ఇండియా, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా ఆర్మీకి భారత సైనికులు అడ్డునిలిచారు. రాడ్లు, రాళ్లతో 6 గంటలపాటు దాడి చేసుకోవడంతో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో TGకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సంతోష్బాబు పాత్రనే <<18686152>>సల్మాన్<<>> పోషిస్తున్నారు.


