News January 8, 2025
నేడు అక్కడ స్కూళ్లకు సెలవు
AP: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నేడు సాయంత్రం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖలో రోడ్ షో చేయనున్నారు.
Similar News
News January 9, 2025
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అటు ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురందీశ్వరి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
News January 9, 2025
తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ ఏమన్నారంటే?
తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. విషయం తెలిసిన వెంటనే CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. తిరుపతిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నాయుడు తెలిపారు.
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.