News November 19, 2024

స్టార్టప్‌ ఐడియా ఉంది.. ఆటోవాలా పోస్టర్ వైరల్

image

మంచి బిజినెస్ ఐడియా ఉంది. కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేంత డబ్బు లేదు. అయినా, అతనేం ఊరుకోలేదు. బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇన్వెస్టర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ‘హాయ్ ప్యాసింజర్స్. నా పేరు సామ్యూల్ క్రిస్టీ. నేను గ్రాడ్యుయేట్‌ని. నా స్టార్టప్ బిజినెస్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నా. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి’ అని ఆటోలో పోస్టర్‌లో అంటించారు. ఇది ఫొటో తీసి ఓ నెటిజన్ పోస్ట్ చేయగా వైరలవుతోంది.

Similar News

News November 30, 2024

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు: CM

image

AP: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ రికార్డులు, భూకబ్జాలు, అసైన్మెంట్ భూముల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

News November 30, 2024

త్వరలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు?

image

TG: పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

News November 30, 2024

TGలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ప్రస్తుతం ఎంతంటే?

image

TGలో టూ వీలర్ల ధర ₹50వేలలోపు ఉంటే 9%, ₹50వేలకంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. TGలో 4 వీలర్ల ధర ₹5లక్షల్లోపు ఉంటే 13%, ₹5L-₹10Lకు 14%, ₹10L-₹20Lకు 17%, ₹20L+కు 18% ట్యాక్స్ విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా TGలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.