News December 6, 2024
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది: హరీశ్ రావు

TG: రాష్ట్ర వ్యాప్తంగా BRS నాయకులు, కార్యకర్తల ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘రాజ్యాంగ నిర్మాత డా.BR అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు? ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించావు. మా నాయకులను విడుదల చేయాలి’ అని ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.


