News December 14, 2024
రాష్ట్రంలో మళ్లీ గజగజ..!

TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.4, నిజామాబాద్‌లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
Similar News
News November 6, 2025
జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.
News November 6, 2025
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


