News February 24, 2025
క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ.. ఏం జరుగుతోంది?

TG: SLBC టన్నెల్లో ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, బురద, నీటి లీకేజీ కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
Similar News
News February 24, 2025
3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
News February 24, 2025
ఓటీటీలోకి కొత్త సినిమా

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.
News February 24, 2025
పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే: అంబటి

AP: ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే YS జగన్ <<15563014>>జర్మనీకి వెళ్లాలన్న<<>> Dy.CM పవన్కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే’ అని సెటైర్ వేశారు. గోవాలో 40 స్థానాలుండగా 21 మ్యాజిక్ ఫిగర్. ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.