News December 29, 2024
పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల
వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.
Similar News
News December 29, 2024
ORR లీజులోనూ అవకతవకలు: కోమటిరెడ్డి
TG: హైదరాబాద్ ORR లీజుకు ఇవ్వడంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. హరీశ్రావు కోరడంతోనే దీనిపై SIT విచారణకు ఆదేశించామని, దీనిలోనూ అవకతవకలు బయటపడతాయన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులో దొంగలు దొరికారని పరోక్షంగా KTRపై మండిపడ్డారు. అటు 2017లో ఆగిపోయిన RRR ప్రాజెక్టుపై తమ కృషి వల్లే ముందడుగు పడిందని, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
News December 29, 2024
నితీశ్ రెడ్డికి అరుదైన గౌరవం
టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో ఆయన స్థానం దక్కించుకున్నారు. ఆసీస్తో టెస్టులో సెంచరీ చేయడంతో ఈ లిస్టులో నితీశ్ పేరు చేర్చారు. కాగా ఇంతకుముందు ఈ లిస్టులో భారత్ నుంచి మన్కడ్, గవాస్కర్, విశ్వనాథ్, పుజారా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరందరూ ఈ మైదానంలో శతకాలు బాదారు.
News December 29, 2024
నిన్న సమంత.. ఇవాళ కీర్తి సురేశ్.. ఇవి ఆగేదెలా?
సరికొత్త ఆవిష్కరణలకు అండగా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న హీరోయిన్ <<15004135>>సమంత <<>>బేబీ బంప్తో ఉన్న ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, తాజాగా మరో నటి కీర్తి సురేశ్ ఫొటోలనూ గర్భంతో ఉన్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటివి క్రియేట్ చేసే వారికి AIని దూరంగా ఉంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.