News April 28, 2024

జగన్ పాలనకు, వైఎస్ పాలనకు పోలికే లేదు: షర్మిల

image

AP: CM జగన్ పాలనకు, వైఎస్ఆర్ పాలనకు అసలు పోలికే లేదని PCC చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘వైఎస్ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండేవారు.. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలతో మమేకం కాలేదు. జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్‌మెంట్ దొరకదు. మద్య నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడే ఉన్నాయి. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.

Similar News

News January 3, 2026

నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

image

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.

News January 3, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

News January 3, 2026

ఫిబ్రవరిలో డీఎస్సీ.. 2,500 పోస్టులు?

image

AP: రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌కు సంబంధించి ఒక పేపర్‌గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.